మేం ఏం చేస్తాం
రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడతాం. ఎప్పుడైనా, ఎక్కడైనా.
మేము ఎలా పనిచేస్తాం
అగ్రశ్రేణి వ్యవసాయ డేటాసెట్లను స్థానిక ఫామ్ సమాచారంతో కలిపి, నాణ్యమైన సలహాలు అందించే, సులభంగా ఉపయోగించగల ఏఐ వ్యవసాయ సలహాదారును మీకు అందిస్తాం.
మీ అవసరాలకు అనుగుణంగా ఫామ్ నిర్వహణ
వ్యవసాయ భూమిని మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నా, ఎన్నో రకాల డేటాతో మేము పనిచేయగలం. అన్ని వివరాలనూ సులభంగా అర్థమయ్యే, ఆచరణలో పెట్టగల ఉపయోగకరమైన సూచనలుగా మార్చి, మీరు చేయాల్సిన పని పూర్తి చేసుకోవడంలో తోడ్పడతాం.
ప్రయోజనాలు
ఉత్పాదకతను పెంచండి
మీ ప్రదేశానికి ప్రత్యేకమైన సూచనలతో నాటడం, పశువులను మేపడం, భూమి అమరిక, పనుల సమయాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోండి.
ఖర్చులను తగ్గించండి
కొత్త విషయాలను త్వరగా నేర్చుకుని, ఫలితాలనిచ్చే వాటిపైనే ఖర్చు పెట్టండి.
కొత్త ఆదాయ మార్గాలను తెరవండి
ఉత్పత్తిలో వైవిధ్యం తీసుకొచ్చి, దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచే సమగ్ర వ్యవసాయ పద్ధతులకు మారండి.
ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచండి
మార్కెట్ మార్పులు, వాతావరణ ప్రమాదాలకు దీర్ఘకాలంలో అనుగుణంగా మారగల వ్యవసాయ వ్యవస్థలను నిర్మించండి.